తెలంగాణ

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కిషోర్ కుమార్

సూర్యాపేట : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలం ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇరవై అయిదు వందల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు.

బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈకార్యక్రమానికి ముందు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply