సిని వార్తలు

ప్రభాస్‌ నెంబర్ వన్‌.. మహేష్, ఎన్టీఆర్ నంబర్ ఇదీ.. పవన్ ప్లేస్‌ దారుణం..!

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందుతున్నారు కొందరు. అయితే.. సోషల్ మీడియా దగ్గరికి వచ్చే సరికి లెక్కలు మారిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు అధికంగా ఉన్నవారి జాబితా తీసినప్పుడు విచిత్రమైన లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. మరి, టాలీవుడ్ లో ఎవరి ప్లేస్ ఎక్కడ? ఏ హీరోను ఎంత మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు? అన్నది చూద్దాం.

ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. యూత్ మొత్తం సామాజిక మాధ్యమాలను స్మరిస్తుండడంతో.. స్టార్ హీరోలు కూడా ఖాతాలను తెరుస్తున్నారు. ఫేస్ బుక్‌, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. వీరిని ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అయితే.. ఒక్కో సామాజిక మాధ్యమంలో ఒక్కో విధంగా ఉంటోంది ఫాలోవర్ల సంఖ్య. ఇప్పుడు ఫేస్ బుక్ లో ఎవరి ఫాలోవర్ల సంఖ్య ఎంత ఉంది అన్నప్పుడు…

మొదటి స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్ల మంది ఉన్నారు. రెండో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇతన్ని 21 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మూడో స్థానంలో మహేష్ బాబు ఉన్నాడు. సూపర్ స్టార్ ను 15 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక, 10 మిలియన్ల ఫాలోవర్లు దాటిన వారు మరో ఇద్దరు ఉన్నారు. రామ్ చరణ్ నాలుగో స్థానంలో ఉండగా.. విజయ్ దేవరకొండ ఐదో స్థానంలో ఉన్నాడు.

మిగిలిన హీరోల నంబర్ కూడా చూస్తే.. నాగార్జునను 8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 6 మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌. మెగాస్టార్ ను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చిరు, జూనియర్ కన్నా నాని ముందుండడం విశేషం. ఇతన్ని 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నితిన్ కూడా 6 మిలియన్ల మందిని కలిగి ఉన్నాడు. రానా దగ్గుబాటి 4 మిలియన్లు, రామ్ 3.9 మిలియన్లు, వరుణ్ తేజ్ 3 మిలియన్లు, సాయిధరమ్ తేజ్ 2.7 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. బాలకృష్ణ ఒక మిలియన్ కు దగ్గర్లో ఉన్నాడు. అయితే.. ఈ జాబితాలో అగ్ర హీరో పవన్ కల్యాణ్ ఫాలోవర్ల సంఖ్య మరీ దారుణంగా ఉండడం గమనార్హం. పవన్ ను అనుసరిస్తున్న వారి సంఖ్య కేవలం 7 లక్షలు మాత్రమే ఉంది.

Leave a Reply