అంతర్జాతీయ వార్తలు

ఫ్రాన్స్‌లో జూలు విదుల్చిన కరోనా – కోటి దాటిన పాజిటివ్ కేసులు

ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఈ వైరస్ జూలు విదిల్చింది. ఫలితంగా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య కోటి దాటిపోయింది. అలాగే, అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా, భారత్ దేశాల్లో ఈ కేసుల సంఖ్య పది మిలియన్లను దాటిపోయిన విషయం తెల్సిందే.

గత 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 2,19,126 కేసులు నమోదయ్యాయి. అలాగే శుక్రవారం కూడా 2,23,200 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మరికొన్ని వారాల పాటు దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Leave a Reply