తెలంగాణ

వైఎస్ వర్థంతికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు: నారాయణ

హైదరాబాద్ : దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మీయులను ఆహ్వానించిన సందర్భంగా తనను కూడా ఆహ్వానించినందుకు వైఎస్ విజయమ్మకు సీపీఐ నేత నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాను హాజరుకాలేక పోతున్నానని ఆయన వెల్లడించారు. ”గౌరవనీయులయిన శ్రీమతి విజయమ్మగారికి నమస్కారం. దిగవంత రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్థంతి సందర్భంగా వారి ఆత్మీయులను ఆహ్వానించిన సందర్భంగా నన్నుకూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజశేఖర్ గారికి, నాకు మధ్య ఆత్మీయత ఉన్నమాట వాస్తవం. అనివార్య కారణాల వలన ఆత్మీయసభకు హాజరుకాలేక పోతున్నందుకు అన్యదా బావించకండి” సీపీఐ నారాయణ తెలిపారు.

Leave a Reply