అంతర్జాతీయ వార్తలు

దుండగుడి కాల్పుల్లో విద్యార్థి మృతి

వాషింగ్టన్‌ : నార్త్ కరోలినాలోని పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుడి కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మిగతా విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. విన్‌స్టన్ సేలంలోని మౌంట్ తాబోర్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని దక్షిణా అమెరికా పోలీస్‌ డిపార్ట్‌మెంట్ చీఫ్ కాట్రీనా థాంప్సన్ తెలిపారు. మహమ్మారి కారణంగా చాలా రోజులు మూతపడిన పాఠశాలలు ఇటీవల తెరువడంతో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. పాఠశాలలో కాల్పుల ఘటన ఈ వారంలో రెండోది.

విన్‌స్టన్ సేలం పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. అయితే, అతడు సైతం పాఠశాలకు చెందిన విద్యార్థి అయి ఉండొచ్చని పేర్కొన్నారు. కాల్పుల తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థిని విలియం చవిస్‌ రేనార్డ్‌ మిల్లర్‌గా గుర్తించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదని, ఘటనపై విచారణ కొనసాగుతుందని ఫోర్సిత్‌ కౌంటీ షరిఫ్‌ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply