క్రీడా వార్తలు

ఆటకు వర్షం ముప్పులేదు.. స్పిన్నర్లకు పండగే! అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే!!

లండన్‌ : భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ముగిసిన మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా.. మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్‌ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం అయ్యే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరగ్గా.. గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌ దృష్టి పెట్టింది. కెన్సింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో టాస్ మధ్యాహ్నం 3 గంటలకు పడనుండగా.. మ్యాచ్ 3.30కి ఆరంభం కానుంది.

Leave a Reply