సిని వార్తలు

తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. పవన్ పేరు వింటేనే చాలు అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోయేలా గోల చేస్తారు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలవరకు ఎంతో మంది పవన్‌కు అభిమానులే. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన పవన్ సినిమాలతోనే కాకుండా.. వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులు గెలుచుకున్నారు.

పవన్ కళ్యాణ్ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply