బన్నీకి పూర్తిస్థాయి బెయిల్‌పై నేడే తీర్పు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ :- ఒక స్టార్ హీరోపై కేసు నమోదవ్వడం, తనను జైలుకు తీసుకెళ్లడం, తను బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరగడం.. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్‌పై కేసు నమోదవ్వడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లడం వల్ల తనకు సమస్యలు మొదలయ్యాయి. హీరో వచ్చాడనే కారణంతో చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకపోయినా థియేటర్‌లోకి ఎంటర్ అయ్యారు. దానివల్ల తొక్కిసలాట జరిగి మహిళ మృతిచెందింది. దీంతో అల్లు అర్జున్‌పై కేసు నమోదయ్యింది. ఫైనల్‌గా ఆ ఉత్కంఠకు తెరపడనుంది.
తీర్పు రాబోతుంది
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ నిందితుల లిస్ట్‌లో అల్లు అర్జున్ పేరు కూడా యాడ్ చేశారు. అంతే కాకుండా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ తనను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు తను జైలులోనే ఉన్నాడు. వెంటనే బెయిల్ కోసం ప్రయత్నించినా అది కుదరలేదు. అలా కొన్ని గంటల తర్వాత అల్లు అర్జున్‌కు బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్‌పై జైలు నుండి బయటికి వచ్చాడు అల్లు అర్జున్. అప్పటినుండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నాంపలి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్‌పై విచారణ జరుగుతుండగా నేడు కోర్టు దీనిపై తీర్పు చెప్పనుంది.
వర్చువల్ వాదనలు
అల్లు అర్జున్ (Allu Arjun) బెయిల్ పిటీషన్‌పై ఇప్పటికీ నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టుకు నేరుగా రాలేకపోయానంటూ వర్చువల్‌గా వాదనలకు అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్. దీంతో వాదనలు విన్న నాంపలి కోర్టు.. శుక్రవారం ఈ విషయంపై తీర్పు చెప్పనుంది. దీంతో ఉత్కంఠ వీడనుంది అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనకు బెయిల్ రావాలని కోరుకుంటున్నారు. చాలావరకు అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందనే నమ్ముతున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఈ హీరోను తీసుకెళ్లి స్పష్టంగా విచారణ చేపట్టారు పోలీసులు. అదే సమయంలో తను రోడ్ షో ఎందుకు చేశాడనే ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదు.
తప్పించుకున్న నిర్మాతలు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప 2’ (Pushpa 2) మేకర్స్‌పై కూడా కేసు నమోదయ్యింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాతలు అయిన నవీన్ యేర్నేని, రవి శంకర్ పేర్లు కూడా నిందితుల లిస్ట్‌లో యాడ్ అయ్యాయి. కానీ వారు థియేటర్ యాజమాన్యం నుండి ముందుగానే అనుమతి తీసుకున్నామని, వారికి ప్రీమియర్స్ గురించి ముందుగానే సమాచారం అందించామని ప్రూవ్స్‌తో సహా చూపించారు. దీంతో కోర్టు వారికి ఈ కేసు నుండి విముక్తి కలిగేలా చేసింది. ఈ విషయంపై కౌంటర్ అఫీడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలా నవీన్ యేర్నేని, రవి శంకర్‌లు ఈ సమస్య నుండి తప్పించుకున్నారు.