ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన సిట్‌పై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయంలో అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సిట్‌పై స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న వ్యాఖ్యానించింది.

Leave a Reply