ఆంధ్రప్రదేశ్

ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు … ని కలసిన కంచారణ కిరణ్ కుమార్

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు గారు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా కిరణ్ మాట్లడుతూ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రజలు కు మరింత సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను అని తెలిపారు.

రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి వైదోలగించి రామ రాజ్య స్థాపనకు కృషి చేయాలి

రాష్ట్ర రాజకీయల నుంచి వైసీపీని పారద్రోలాలీ

రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి వైదోలగించి రామ రాజ్య స్థాపనకు కృషి చేయాలి విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు అన్నారు.50వ వార్డులో గల మురళీ నగర్,మాధవధార,వంశీ నగర్, తేన్నేటి నగర్,మాన్యం,నరసింహ నగర్ ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు మద్దత్తుగా సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు,ఎమ్ పి అభ్యర్థి శ్రీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ వెళ్లి పర్యటించారు.ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ అంశాలను ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈరోజు మ్యానిఫెస్టోతో జగన్ రాజకీయ అస్త్రసన్యాసం చేశాడు.మా సూపర్ హిట్ సూపర్ సిక్స్ ముందు జగన్ రెడ్డి మ్యానిఫెస్టో వెలవెలబోయింది. హామీలను అమలుచేయడం తన వల్లకాదని జగన్ చేతులెత్తేశాడని వరప్రసాద్ అన్నారు.

జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. వచ్చేనెల 13న సైకో జగన్ ఇంటికి పోవడం ఖాయం. దోచుకోవాల్సిందంతా దోచుకుని, దాచుకున్నాక జగన్ చేతులెత్తేశాడు. కురుక్షేత్ర యుద్దం మే13 న జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో కౌరవ వధ జరుగుతుంది,ఎన్నికల్లో విజయదుందుభి మోగించి కౌరవసభను గౌరవసభగా మారుస్తాం అని అన్నారు.ఈ సందర్బంగా ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూన వెంకట్రావు,జనసేన వార్డు ఆధ్వర్యంలో సనపల శివ సాగర్,బీజేపీ నాయకులు సనపల రామకృష్ణ,తెలుగుదేశం నాయకులు పైడి పుణ్యవతి,సనపల రామచంద్ర రావు,అరుణ్,నంబాళ్ల సత్యనారాయణ,నంబాళ్ల నాగరాజు,చౌదరి నరసింహం,చౌదరి లక్షణ్,పప్పల గౌరీ,నాగన్న,చక్రి,ఆర్ ఈశ్వర్ రావ్,శేఖర్,కనకమ్మ,పెంటకోట శ్రీనివాస్,చంద్ర శేఖర్ రాజు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply