తెలంగాణ

రాష్ట్రపతి శీతాకాలపు విడిది హైదరాబాద్, 28న రానున్న ద్రౌపది ముర్ము

హైదరాబాద్ : మన భారతదేశపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఎందుకనంటే రాష్ట్రపతులకు శీతాకాలపు విడిదిగా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా ఉంది. ఇందుకోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ప్రోటోకాల్ విభాగం అన్ని ఏర్పాట్లు చేయడం విశేషం.

డిసెంబర్ 28 ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకుంటారు.

డిసెంబర్ 29 ఉదయం నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అతిథులతో భేటీ అవుతారు.

డిసెంబరు 30న ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, బొల్లారం రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ ఇతర కీలకశాఖలతో ఏర్పాట్లపై త్వరలో సీఎస్ సమావేశం ఏర్పాటుచేయనున్నారు.

2019లో చివరిసారిగా నాటి రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవిద్ హైదరాబాద్ వచ్చారు. తర్వాత కరోనా కారణంగా రాలేదు. ఇప్పుడు మళ్లీ ద్రౌపదీముర్ము రావడంతో రాష్ట్రపతి నిలయానికి కొత్త కళ వచ్చింది.

Leave a Reply