ఆంధ్రప్రదేశ్

మిస్ సౌత్ ఇండియాగా ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ

విశాఖపట్నం : మిస్ సౌత్ ఇండియాగా ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థినిగా ఛరిష్మా కృష్ణ ఎంపికయ్యారు. ఆమెకు మిస్ సౌత్ ఇండియా కిరీటం దక్కింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్న ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచింది.

కాగా, ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన యువతులు పాలుపంచుకున్నారు. వీరందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా… ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే మరోవైపు నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్టర్ రన్నరప్‌గా నిలువగా కర్నాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచింది.

Leave a Reply