జాతీయ వార్తలు

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్లాన్… రూ.60 కే లీట‌ర్ పెట్రోల్

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డానికి సరి కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు స‌మాచారం. పెట్రోల్ ధ‌ర‌లు నిజానికి అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల పై నే ఆధార ప‌డి ఉంటుంది. అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌రలు త‌గ్గితేనే మ‌న దేశంలో పె ట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి.

ఒక వేళ పెరిగితే మ‌న దేశం లో కూడా పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే ఇక నుంచి మ‌న దేశంలో పెట్రోల్ ఉత్ప‌త్తులు క్రూడ్ అయిల్ పై ఆధార ప‌డ‌కుండా కొత్త విధానం గురించి ఆలోచిస్తున్నారు. ఇథ‌నాల్ బ్లెండింగ్ ను పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.

దీని ద్వారా పెట్రోల్ డిజిల్ ల‌ను ఉత్ప‌త్తి పెంచాల‌ని ప్ర‌యత్నం చేస్తున్నారు. అలా చేస్తే క్రూడ్ అయిల్ తో సంబంధం లేకుండా మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌ల ను నియంత్రించ వ‌చ్చు. దీని కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రూ.60 కే లీట‌ర్ పెట్రోల్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply