ఆంధ్రప్రదేశ్

బీజేపీ మహిళ కార్పొరేటర్ … గంకల కవిత అప్పారావుకు అవమానం

విశాఖపట్నం , మాధవధార : జీవీఎంసీ కౌన్సిల్ లో రగడ

అభివృద్ధి పై ప్రశ్నించిన జీవీఎంసీ బీజేపీ మహిళ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావుకు అవమానం

ప్రశ్నించినందుకు మహిళా కార్పొరేటర్ అని చూడకుండా మార్షల్స్ తో ఈడ్చుకెళ్లిన వైనం

వైసీపీ అరాచకాలు కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్తాం

క్షమాపణ చెప్పాలని మేయర్ ఆదేశాలు

అభివృద్ధికి నోచుకోని 48వ వార్డ్ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని గంకల డిమాండ్

48వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టండి – సాష్టాంగ నమస్కారం చేస్తా

గంకల కవితను కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసిన మేయర్

శుక్రవారం నాడు జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.కౌన్సిల్ సమావేశంలో 48వ వార్డ్ కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు వార్డ్ అభివృద్ధి పై ప్రశ్నించారు. తన వార్డులో అభివృద్ధి పనులు జరగడం లేదని,వార్డులో శంకుస్థాపనలు చేసి పనులు ఎందుకు చేయరు అని అధికారులను,అధికార పార్టీ నాయకులపై 48వ వార్డు బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత ఫైర్ అయ్యారు. రూ.1.5కోట్లతో పనులు అన్నారు.ఎక్కడ చేశారో చెప్పండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం మొత్తం స్తంభించిపోయింది.తన వార్డులో పనులేవీ జరగడం లేదని ఆవేదన చెందిన కవితను తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు.ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పలువురు అధికారులు తప్పించుకున్నారు.పెరిగిన ఇంటి పన్నులు,చెత్త పన్నులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,రిటనింగ్ వాల్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని,స్టాండింగ్ కమిటీ వారు ఏకధోరణితో కొన్ని వార్డులకు మాత్రమే నిధులు కేటాయించడం,ముఖ్యంగా కొండవాలు ప్రాంతపు పర్యటన కూడా చేయకపోవడం పై అంతరాయం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేసారు.దీంతో మేయర్ కలుగ చేసుకుని గంకల కవిత తక్షణమే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని మేయర్ హెచ్చరించారు.48వ వార్డులో అభివృద్ధి పనులు చేపడితేనే తాను తన వాఖ్యలు ఉపసంహరించుకుంటా అని మొండికేశారు. అంతే కాకుండా అన్ని పార్టీలని ఒకేలా చూడకుండా పనులకు ఆదేశించకుండా ఉన్న వాళ్లే తనకు,వార్డ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని,అభివృద్ధి చేస్తే తను నేరుగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు.అయినప్పటికి గంకల కవిత అప్పారావు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మున్సిపల్ యాక్టు 89ప్రకారం కవిత ను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ ప్రకఠించారు.అయితే వెంటనే కవిత స్పందించి మేయర్ తీరు పట్ల మేయర్ డౌన్ డౌన్ అంటూ పోడియం ఎదుట ఆందోళనకు దిగి బైఠాయించారు.దింతో అనంతరం మార్షల్స్ ను పిలిచి గంకల కవితను ప్రశ్నించినందుకు మహిళా కార్పొరేటర్ అని చూడకుండా మార్షల్స్ తో ఆమెను బయటకు ఈడ్చుకు వెళ్లారు.ఈ సందర్బంగా వైసీపీ అరాచకాలు కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్తామని నేటి కౌన్సిల్ తీరు నగరమంతా చూస్తుందని,కౌన్సిల్ తీరును కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్తామని బీజేపీ పెద్దలతో చర్చించామని అన్నారు.ఇందులో భాగంగా 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్,టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస రావు,సిపిఎం నేత గంగారావు మేయర్ తీరు పట్లఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్పొరేటర్ పట్ల మార్షల్స్ వ్యహరించిన తీరు సబబు కాదన్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. చివరకు మార్షల్స్ దూకుడుగా వ్యవహరించి కవితను బయటకు తీసుకు వెళ్లిపోయారు.

Leave a Reply