తెలంగాణ

తెలంగాణాలో మొదటి కేసు

హైదరాబాద్ : చైనాను వణికిస్తున్న ‘ఎక్స్ బీబీ 1.5 వేరియంట్’ తెలంగాణాలో మొదటి కేసు.

FIRST CASE XBB 1.5 VARIANT IN TELANGANA :- చైనా, అమెరికాలను వణికిస్తున్న మహమ్మారి మరో రూపం దాల్చుకుని ‘ఒమ్రికాన్ ఎక్స్ బీబీ1.5 వేరియంట్ ’ గా పేరు పెట్టుకుని వచ్చేసింది. దేశంలో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ లో కొత్తగా ఎక్స్ బీబీ వేరియంట్ కేసులు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దేశం మొత్తమ్మీద ఏడు కేసులు నమోదైనట్టు ‘ఇన్స్ కాగ్’ తెలిపింది. ఇంతకుముందు గుజరాత్ లో (3), రాజస్థాన్ లో(1), కర్ణాటకలో (1) నమోదయ్యాయి.

ఇదేమైనా అత్యంత ప్రమాదమా? అని ప్రశ్నిస్తే, వ్యాప్తి ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. శరీరం లోపలకి వెళ్లిన తర్వాత…రోగ నిరోధక శక్తిని ఏమార్చి, దానిని పక్కదారి పట్టించి, అప్పుడు ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అంటే ఇది ఒక ‘మాయల మారి’ అని చెబుతున్నారు.

ఒమ్రికాన్ 1.5 ఎక్స్ బీబీ వేరియంట్ రకానికి చెందినది. అమెరికాలో మహమ్మారి పెరిగిపోవడానికి ఈ వేరియంటే కారణమని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. చైనాలో కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి ఈ వేరియంట్ కారణమని అంటున్నారు.

గతంలో చేసినట్టు ప్రభుత్వాలేవీ కూడా ప్రజలకు హితోపదేశాలు చేయడం లేదు. ఒకవేళ మహమ్మారి పట్టి పీడిస్తుంటే ఆసుపత్రులు, అందులో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా? లేవా? వ్యాక్సిన్ అందిందా లేదా? ఇవన్నీ చూసుకుంటున్నాయి. అంతే తప్ప, ప్రజలకు అవగాహనలాంటివి చేయడం లేదు.

అందుకని ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. మళ్లీ ఎప్పటిలాగే అటకెక్కించిన మాస్క్ లు, శానిటైజర్లు బయటకు తీసి జేబులో పెట్టుకు తిరగాలి. సామాజిక దూరం పాటించాలి. అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకూడదు.

ఇది ప్రజలదే బాధ్యత అంటున్నారు. చీటికిమాటికి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పలేరు కదా…అని కొందరు వ్యాక్యానిస్తున్నారు. మరి చైనా ప్రజల్లా లాక్ డౌన్ కి ఎదురుతిరిగి అవస్థలు పడతారా? తెలివిగా బయటపడతారా? అనేది భారతీయుల చేతుల్లోనే ఉందని సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.

Leave a Reply