ఆంధ్రప్రదేశ్

వైకాపా నేతలవి రోడ్లు వేసే మొహాలేనా? టీడీపీ చీఫ్ చంద్రబాబు

గుంటూరు : వైకాపా నేతలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతతో పరిపాలన ప్రారంభించన వైఎస్ జగన్ పాలన విధ్వంసంగానే సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో గృహాలను కూల్చిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రోడ్డు వేసే మొహాలు ఇవేనా అంటూ సెటైర్ వేశారు.

ఈ వైకాపా ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డివి వంద తప్పులు దాటాయని, ఇగ మిగిలింది ప్రభుత్వ పతనమేనని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అరెస్టులు, అహంకారం, అడ్డగింతలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. సీఎం అధికార దాహానికి, అహంకారానికి జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కేవలం 600 ఇల్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి వేస్తారా అని నిలదీశారు. ఇది కక్ష సాధింపు కాకుంటే మరేంటని ఆయన ప్రశ్నించారు. “ఇప్పటం గ్రామానికి వెళుతున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునే, చీకట్లో తన రోడ్‌షోలో రాళ్లు రువ్వితోనే మీరు సాధించబోయేది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు.

Leave a Reply