ఆంధ్రప్రదేశ్

వైద్య విద్యార్థినిని హత్య చేసిన ప్రేమికుడు

గుంటూరు : ఒక ప్రేమోన్మది చేసిన ఘాతుకంతో తుళ్లిపడి లేచింది సమాజం. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్నానేశ్వర్ అనే యువకుడు దాడిచేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించడంతో విద్యార్థిలోకం ఘోల్లుమంది.

వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న జ్నానేశ్వర్, ఇంకా వైద్య విద్యార్థిని ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు వేరే పెళ్లి చేసే ఉద్దేశాలతో ఉండటంతో వారి మధ్య విభేదాలు ఇంతటి ఘోరానికి పాల్పడ్డాయని చెబుతున్నారు.

మొదట జ్నానేశ్వర్ ఆపరేషన్లు చేసే సర్జికల్ బ్లేడ్ తో ఆమె గొంతుపై కోశాడు. తీవ్రంగా రక్తం పోతుండటంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో తను మరణించింది. నేను కూడా మరణిస్తానంటూ జ్నానేశ్వర్ అదే బ్లేడ్ తో చేయ కోసుకోవడంతో స్థానికులు చూసి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం తను ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం.

Leave a Reply