సిని వార్తలు

ఇంకా కసి ఉంది: బాలకృష్ణ

హైదరాబాద్ : ‘‘పది నిమిషాల్లో క్లోజయ్యే ఏ పబ్ లోకైనా వెళ్లి చూడు…అక్కడ నీకొక స్లోగన్ వినిపిస్తుంది.’’ కట్ చేస్తే…‘జై బాలయ్యా’ అని అరుపులు-కేకలు…’’

ఈ బిట్ వినగానే మీలో చాలమందికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఇది నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ కొత్త సినిమాలో పంచ్ డైలాగ్…ఆయనేం చెప్పినా, చేసినా అది వెరైటీగానే ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే…

ఇంతకీ విషయం ఏమిటంటే…నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సంక్రాంతి సినిమా వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లోని ఏఐజీ మైదానంలో ఘనంగా జరిగింది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా?అన్నంత హడావుడిగా వాతావరణమంతా మారిపోయింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బాలకృష్ణ, శృతిహాసన్, నిర్మాతలు నవీన్, రవిచంద్రలు ఒంగోలు చేరుకున్నారు.

బాలకృష్ణ సినిమా అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఎందుకంటే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఫ్యాక్షనిజం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఫ్యాక్షన్ సినిమాలు తీసి విఫలమయ్యారు. మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు. చిన్న హీరోలు కూడా ఆ ప్రయత్నాలు చేసి బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డారు. ఆ ఫ్యాక్షనిజాన్ని పండించాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతేనని, అంతా మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. దాంతో బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడార్ గా మారిపోయారు.

ఈకోవలో వస్తున్నదే… వీర సింహారెడ్డి సినిమా…సంక్రాంతికి విడుదలవుతున్న సినిమా ప్రీరిలీజ్ వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే…నా జన్మ ధన్యమైనట్టుగా ఉంది. అందరూ బాలకృష్ణ సినిమాలకి, రాజకీయాలకే పరిమితమైపోయాడని అనుకున్నారు. ‘‘నాలో ఇంకా కసి ఉంది. చివరి వరకు నటిస్తూనే ఉంటా’’ అందుకే ‘అన్ స్టాపబుల్ ’ చేస్తున్నా…ఇప్పుడా ప్రోగ్రాం నెంబర్ 1గా ఉందని తెలిపారు.

నాకు జన్మనచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే ఆయనకు ముందుగా శత జయంతి అభినందనలు చెబుతున్నానని అన్నారు. నా తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే అన్నారు. ఆయన నటనలో చేయని ప్రయోగాలు అంటూ లేవు. అలాంటి నటుడు మరొకరు లేరనే సంగతి ప్రతీ ఒక్క నటుడు అంగీకరిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరికి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు.

ఎప్పటికైనా మంగోలియన్స్ అయిన జంగిస్ ఖాన్ సినిమా తీస్తానని అన్నారు. ఇది నా జీవితాశయమని తెలిపారు. మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించే బి.గోపాల్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఆయనతో నేను చేసిన సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మీ అందరికీ తెలుసునని అన్నారు. ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనిది ఒంగోలు, నా తదుపరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిది ఒంగోలు…నేను ఒక్క ప్రాంతానికి, ఒక కులానికి చెందిన వాడినికాదు… మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజును నేనే, రెడ్డిని నేనే, నాయుడిని నేనే, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని అని అభిమానుల హర్షధ్వానాల మధ్య తెలిపారు.

చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీర సింహారెడ్డి కూడా ఒకటి అవుతుందని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేశారని కితాబునిచ్చారు. హీరోయిన్ శృతిహాసన్ మాట్లాడుతూ నేను దర్శకుడు గోపీచంద్ తో చేసిన మూడో సినిమా ఇది. ఆయన్ని నేను అన్నయ్యగా భావిస్తాను. బాలకృష్ణగారు పాజిటివ్ పర్సన్, ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని అన్నారు.

Leave a Reply