ఆంధ్రప్రదేశ్

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

పలాస : మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ న్యాయ సేవా సదనం ఆదేశాల ప్రకారం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి పి రవిశంకర్ ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఆఫీసులో మహిళదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఏ దేశంలో లేదని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా విశేష సేవలు అందించిన మహిళలను సివిల్ జడ్జి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు తాండ్ర. మురళి, న్యాయవాదులు అనిల్ రాజు, పిండి వెంకటరవు, సిఐ శ్రీనివాసరావు, ఆర్. టీ. సి డిపో మేనేజర్ శ్రీనివాసరావు, నాగ ప్రసాద్, దేవరాజ్, చంద్రశేఖర్, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply