ఆంధ్రప్రదేశ్

‘జయహో బీసీ’ సభకు భారీ ఏర్పాట్లు

విజయవాడ : బీసీ ప్రజాప్రతినిధులతో, ప్రజలతో భారీ ఎత్తున విజయవాడలో వైసీపీ నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు లక్షమంది వరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సభ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా బుధవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

బీసీల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఊపందుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు కూడా బీసీల పాటనే పాడటం చూస్తుంటే, రేపటి ఎన్నికల్లో వారెంత కీలకమో అర్థమవుతోంది. అందుకే మా పార్టీలోనే బీసీలు ఎక్కువున్నారని వారంటే, మా పార్టీలోనే ఎక్కువని వీరు బల నిరూపణలకు దిగుతున్నారు.

రేపు తెలుగుదేశం పార్టీ మరో బీసీ సభ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు. ఇక జనసేన పవన్ కల్యాణ్ అయితే బీసీ వర్గాలను కలుస్తున్నారు. వారి సభలకు హాజరవుతున్నారు. మాతోనే సామాజిక న్యాయం అని కూడా చెబుతున్నారు.

ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి బీసీల్లో 134 పైనే సామాజిక వర్గాలున్నాయని, అందుకే కుల గణణ చేయాలని, అప్పుడే ఎవరికెంత న్యాయం జరుగుతుందో తెలుస్తుందని దీనిపై రాజ్యసభలో ప్రశ్నిస్తానని, శీతాకాల సమావేశాల్లో ఇదే నా మొదటి ప్రశ్న అని అన్నారు.

Leave a Reply