తెలంగాణ

మున్సిపల్‌ కమిషనర్‌ భార్య ఆత్మహత్య

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉదయం ఫోన్‌ చేసి తనను చంపేలా ఉన్నాడని చెప్పినట్లు తెలిపారు. కమిషనర్‌గా ఎంపికైన తర్వాతినుంచి వేధింపులకు గురి చేస్తున్నారని, మరో పెళ్లి చేసుకుంటే రూ.కోట్ల కట్నం వస్తుందని వేధించేవారని తెలిపారు.

Leave a Reply