తెలంగాణ

అమెరికా కాల్పుల ఘటనలో తెలుగమ్మాయి మృతి.. హైదరాబాద్ లో విషాదం..

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: శనివారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం చెందింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి(27) దుండగుడి తూటాలకు బలైపోయింది. అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఐశ్వర్య విధులు నిర్వర్తిస్తోంది. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐశ్వర్యరెడ్డితో సహా మొత్తం 8మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మాల్ దగ్గరకు కారులో వచ్చిన దుండగుడు లోపలికి చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో భయభ్రాంతులైన వందలాది మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఇంకొంత మంది మాల్‌లోనే దాక్కున్నారు. మృతుల్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply