సిని వార్తలు

అరుదైన వ్యాధి బారినపడ్డ సిద్దార్థ్.. అభిమానులకు బిగ్ షాక్..

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, చెన్నై :- టాలీవుడ్ లో ఒకప్పుడు కుటుంబ కథ చిత్రాలతో ప్రేక్షకుల మనసుతో దోచుకున్న హీరో సిద్ధార్థ్.. బొమ్మరిల్లు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సిద్ధార్థ ప్రస్తుతం తెలుగులో అంతగా సినిమాలు చేయలేదు కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ బిజీగా ఉన్నాడు. లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తమిళ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నాడు.. తర్వాత కొన్ని ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చిన సరైన సినిమాలు అందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, లవర్ బాయ్ గా నటించి మెప్పించిన సిద్ధార్థ.. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. ఇటీవల ఈ హీరో పేరు ఎక్కువగా వార్తలో నిలుస్తుంది తనకు సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ వార్తల్లో హైలైట్ అవుతున్నారు సిద్ధార్థ్. తాజాగా అయినా ఓ అరుదైన వ్యాధి బారిన పడినట్టు స్వయంగా ఆయనే చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.

నటుడు సిద్దార్థ్ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలను చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సిద్ధార్థ కేవలం తెలుగు సినిమాలనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఇక ఇటీవల రిలీజ్ అయిన చిన్న మూవీతో మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుని మరోసారి ఫామ్ లోకి వచ్చారు సిద్ధార్థ్. ఈ సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది.

అయితే గత ఏడాది మిస్ యూ మరియు భారతీయుడు 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ టాక్ని అందుకోలేకపోయాయి దాంతో సిద్ధార్థ క్రేజ్ ఏ మాత్రం పెరగలేదు. గత ఏడాది టాలీవుడ్ బ్యూటీ అతిధి ని పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్న సిద్ధార్థ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా కంట పడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సిద్ధార్థ్.. ఈ క్రమంలో ఆయన అభిమానులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

సిద్దార్థ్ ఏమన్నారంటే..?

సిద్దార్థ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాటాడుతూ.. తనకొక అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.. కారణం నా అభిమానులే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీకిలోకి నటీనటులు చాలా మంది మంచి ఫేం, ఫాలోయింగ్, గుర్తింపు రావాలని కోరుకుంటారనీ, ఇక ఒక్కసారి ఆ క్రేజ్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని తెలిపారు.. నాకు అభిమానుల వల్ల ఓ వ్యాధి వచ్చిందని అన్నాడు. పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే వ్యాధి వచ్చిందనీ, ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టిందని కామెంట్ చేసాడు ప్రస్తుతం మీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఇలాంటి వ్యాధి కూడా వస్తుందా ఏంటి సిద్ధార్థ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు.. మరి దీనిపై సిద్ధార్థ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి..

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×