Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
తెలంగాణ

‘వందే భారత్’ రైలు వచ్చేస్తోంది

సికింద్రాబాద్ : Vande Bharat Express: Secunderabad to Visakha Train :- తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ఏమిటంటే…‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైలు వచ్చేస్తోంది.అందుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. జనవరి 19న ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ టు విశాఖ పట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారనే శుభవార్త తెలిసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైలు కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు…సికింద్రాబాద్ టు విశాఖపట్నం, మళ్లీ విశాఖపట్నం టు సికింద్రాబాద్ మధ్య నడవనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు ఆయనే విషయం తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు మార్గమధ్యంలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ ట్రైన్ నడవడానికి తగినట్టుగా ట్రాక్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు.

గంటకు 180 కిమీ గరిష్ఠ వేగంతో నడిచే సామర్థ్యం ఉన్న రైలు, మన ట్రాక్ పై సుమారు 130 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరి (ఐపీఎఫ్)లో తయారయ్యే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు…మన భారతీయ రైల్వేలో ఒక ముందడుగు అని తెలిపారు. సొంత సాంకేతికతతో బుల్లెట్ రైళ్లు తరహాలో రూపొందిన ఈ రైలు…భవిష్యత్తులో బుల్లెట్ రైలుగా గంటకు 400కిమీ స్పీడుతో వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. ఆల్రడీ ఢిల్లీ-అహ్మదాబాద్ కు

ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రస్తుతం నాలుగు భారతదేశమంతా నడుస్తున్నాయి. బెంగళూరు-మైసూర్- చెన్నై రైలు. ఇది గత ఏడాది నవంబరు 10న పట్టాలెక్కింది. అయితే మన దక్షిణ భారతదేశానికి ఇదే తొలి రైలు. భారతదేశంలో లెక్క ప్రకారం తర్వాత వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య సేవలు అందించనుంది.

Leave a Reply

%d bloggers like this: