ఆంధ్రప్రదేశ్

ఇదీ మన ప్రపంచం : రాజధాని లేని ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలిపోయింది. “మన ప్రపంచం” సెమిస్టర్ -2 పుస్తకంలో ముద్రించిన భారతదేశ చిత్రపటంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముద్రించారు. ఈ పటంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తిచారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని చూపించి వదిలేశారు.

అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్ర పేరు చెప్పి వదిలివేయడంతో ఉపాధ్యాయులు, విద్యావంతులు నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటపుడు ఏపీ గురించి ఏమని చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి 2021-21 సంవత్సరానికిగాను ముద్రించారు.

Leave a Reply