తెలంగాణ

సంక్రాంతి పండగకు ఊరెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకొండి

మేడ్చల్ : సంక్రాంతి పండకలి ఊరెళ్లే ప్రజలు పలు జాత్రలు తీసుకోవాలని శామీర్ పేట్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. శుక్రవారం శామీర్ పేట్ సీఐ సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఊరెళ్లేవారు తమ ఇంటిలో విలువైన డబ్బులు, బంగారు అబరణాలు బ్యాంక్ లాకర్ లో గాని తెలిసిన వారి వద్ద గాని భద్రపర్చుకోవాలని సూచించారు. ఇంటి ముందు తలుపులకు సెంట్రల్ లాక్ వేసి బయట బేడం పెట్టాలని, సొంత ఉరులకు వెళ్ళే వారు మీ ఇంటి పై నిఘా ఉంచమని పోలీసు స్టేషన్ కు గాని, పక్కవాళ్ళకు గాని తెలియజేయాలన్నారు. అనుమానస్పందగా ఎవరైనా వ్యక్తులు కాలనీ లో తిరుగుతున్న శామీర్ పేట్ పోలీసు స్టేషన్ కు గాని, డయల్ 100 గాని తెలియజేయాలని సూచించారు. వాహనాలను రోడ్డు పై కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయాలని సీఐ తెలిపారు.

Leave a Reply