చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ :- బుక్ మై షోలో రివ్యూ ఆప్షన్ మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దీని వల్ల.. రివ్యూ రేంటింగ్ జెన్యూన్ గా ఉండడం లేదని.. ఫలితంగా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయని మేకర్స్ బలంగా వాదిస్తున్నారు. ఈక్రమంలోనే మన శంకర వర ప్రసాదు గారు టీం.. బుక్ మై షో రివ్యూ రేంటింగ్ కు చెక్ పెట్టింది. తమ సినిమాకు బుక్ మై షోలో రివ్యూ రేటింగ్ ఆప్షన్ లేకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. దీంతో బుక్ మై షో కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది కావాలని సినిమాలకు నెగిటివ్ రివ్యూ, రేటింగ్ లు ఇస్తున్నారు. దానివల్ల మంచి సినిమాలపై ప్రభావం పడుతోంది. ఆలాంటి సిచువేషన్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు రాకూడదని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు మేకర్స్కు సానుకూలంగా తీర్పును వెల్లడించింది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ రాజాసాబ్ మినహాయించి మిగతా అన్ని సినిమాలు కూడా బుక్ మై షో రివ్యూ రేటింగ్ ఈ విషయంలో కోర్టు నుంచి పెర్మిషన్స్ తీసుకున్నాయి. రవి తేజ హీరోగా వస్తున్న భర్త మనశయులకు విఙ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నీవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలకు కూడా కోర్టు ఇదే తీరును ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ బుక్ మై షో కూడా మార్పులు చేసింది. ఈ మూడు సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది.

