తెలంగాణ

ఎన్నికలున్న చోటకు మంత్రులు వస్తే తప్పేంటీ?: తలసాని

కరీంనగర్ : ఎన్నికలున్న చోటకు మంత్రులు వస్తే తప్పేంటీ? అని మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మోదీ దేశానికి ప్రధాన మంత్రి.. బిజేపీ నేత కాదన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ప్రధానిని కేసీఆర్ కలిశారని చెప్పారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పనికి రాని మాటలు బండి సంజయ్ ఎన్నైనా మాట్లాడతారని విమర్శించారు. విమోచన దినోత్సవం జరపాలని కోరడం పనికి మాలిన పనన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నికల తర్వాత కనిపిస్తారా? అని ప్రశ్నించారు.

Leave a Reply