ఆంధ్రప్రదేశ్

సనాతన ధర్మమే మానవాళికి సరైన మార్గము

కైకలూరు : సనాతన ధర్మమే మానవాళికి సరైన మార్గమని, సాధన లేకుంటే భగవంతుని సాక్షాత్కారం లభించదని ఇస్కాన్ హిందూ సంస్థకు చెందిన గురువు పరమపూజ్య శ్రీరామ గోవింద మహారాజు పేర్కొన్నారు. మండవల్లి గ్రామంలో హిందూ ధర్మ సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సత్సంగంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా ధర్మాన్ని పాటించకపోతే పశువులతో సమానమని, మనుష్యుల శరీరంతోటే భగవంతుడి ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. సనాతన ధర్మం గురించి భక్తులకు బోధించారు. అనంతరం ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

Leave a Reply