జాతీయ వార్తలు

దేశంలో పెరుగుతున్న కరోనా.. వెయ్యికి పైనే కొత్త కేసులు

ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు శాంతించిన కరోనా కేసులు.. ఇప్పుడు విజృంభించేందుకు సిద్దమౌతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 49,622 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమతంగా ఉండాలని.. రెగ్యులర్ గా చేతులు కడుక్కోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యాధికారులు సూచించారు.

Leave a Reply