సిని వార్తలు

‘మా’ విష్ణును ఇబ్బందులకు గురిచేస్తే బాగుండదు.. నరేష్ వార్నింగ్

హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడుగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మా సభ్యులకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. తదుపరి ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. ‘మా’ ఒక సేవా సంస్థ. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగుండదని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ గెలిచారని కాంగ్రెస్‌ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా..! ‘మా’ సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?’ అని నరేశ్‌ వ్యాఖ్యానించారు.

Leave a Reply