చంద్రగ్రహణం.. బ్లడ్ మూన్‌గా కనిపించనున్న చందమామ

విశాఖపట్నం : చంద్రగ్రహణం ఈ నెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రుడు బ్లడ్ మూన్ ఆకారంలో కనిపించనున్నాడు.

చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ్లద్దాలు అవసరం లేదని, రక్షణపరికరాల్లేకుండానే చూడవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు.

నాసా ఈ చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. సోమవారం ఉదయం 8.33 గంటలకు నాసా వెబ్‌ సైట్‌లో లైవ్‌ ద్వారా చూడొచ్చు.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:02 గంటల నుండి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 7.57 గంటల నుండి భూమి నీడ చంద్రుడి మీద పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఉదయం 10.15 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది.

గంట అనంతరం సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఈసమయంలో చంద్రుడిని బ్లడ్‌మూన్‌గా పిలుస్తారని అన్నారు. సాధారణంగా సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు చెల్లాచెదురవుతాయని.. కేవలం ఎరుపు, నారింజ రంగులు కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

అయితే మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్‌, ఆఫ్రికా, న్యూజిలాండ్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది.

Leave a Reply

%d bloggers like this: