జాతీయ వార్తలు

కండక్టర్‌తో ప్రయాణీకుడికి గొడవలు.. పిడిగుద్దులు

మధ్యప్రదేశ్‌ : కొన్నిసార్లు టికెట్‌ ధరల విషయంలో కండక్టర్‌తో ప్రయాణీకులు గొడవలు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో.. గొడవలు కాస్త కొట్టుకొవడం వరకు వెళ్తుంటుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ఎన్‌సిసి క్యాడెట్ బస్సు ఎక్కాడు.

టికేట్ తీసుకొవడానికి కండక్టర్ వచ్చాడు. అప్పుడు.. అతను దిగే స్టాప్ కండక్టర్ 15 రూపాయలు టికెట్ ఇచ్చాడు. కానీ 10 మాత్రమే అని ఎన్‌సిసి క్యాడెట్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అది కాస్త పిడిగిద్దులు కురిపించుకోవడం వరకు వెళ్లింది. కాసేపటికి ఎన్‌సిసి క్యాడెట్ బస్సు దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత, కండక్టర్, స్థానికులు అతడిని పట్టుకున్నారు.

అతడిని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పంజాబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply