జాతీయ వార్తలు

గ్యాంగ్ స్టర్ అతీక్ హత్య నేపథ్యంలో యూపీలో 144సెక్షన్

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శనివారం రాత్రి ఇద్దరి హత్యలు జరిగిన వెంటనే స్పందించిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

Leave a Reply