ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండగావాడి దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దేవదేవుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 59,776 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Leave a Reply