ఆంధ్రప్రదేశ్

అవినాశ్ విచారణ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం

తాడేపల్లి : వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని కాసేపట్లో సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాశ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను మరికాసేపట్లో న్యాయస్థానం విచారించనుంది. దీంతో సీఎం జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలి దానిపై జగన్ చర్చిస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కరరెడ్డిని పదిరోజులు కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితుల నుంచి కీలక విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించగా.. కస్టడీ పిటిషన్ లో సీబీఐ వివరాలు సరిగా సమర్పించలేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.

Leave a Reply