తెలంగాణ

చవితి రోజున గణేశ పూజ.. నెయ్యిని దానంగా ఇస్తే?

హైదరాబాద్ : చవితి రోజున గణేశ పూజ శుభ ఫలితాలను ఇస్తుంది. గణేశుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు. గణేశుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆనందం , శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

చవితితో పాటు ప్రతి బుధవారం వినాయక స్వామి ఆలయంలో ఆవు నెయ్యి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేస్తే వ్యాపారంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. పురోగతికి కొత్త మార్గాలను లభిస్తాయి.

అలాగే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం, ఇంటి పూజాగదిలో ప్రతి బుధవారం లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి, కోరికలు నెరవేరాలని లక్ష్మీ దేవిని ప్రార్థించాలి.

ఇంకా వృత్తిలో విజయాన్ని పొందడానికి, బుధవారం, చవితి నాడు ఆలయానికి లేదా బ్రాహ్మణుడికి కొత్త మట్టి కుండలో నీటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఏదైనా పనిలో పదే పదే కష్టాలు ఎదురైతే, ఆ పనిలో విజయం సాధించడానికి, స్నానమాచరించిన తర్వాత వినాయకుడికి నమస్కరించి, శ్రీ గణేశాయ నమః అనే గణేశ మంత్రాన్ని11 సార్లు జపించండి. గణేశుడికి ఎర్రటి పువ్వులు సమర్పించండి.

అలాగే అనుకున్న కోరికలు నెరవేరాలంటే.. చవితితో పాటు బుధవారం నాడు గణేశ ఆలయాన్ని సందర్శించి… అది నెరవేరడానికి బెల్లం సమర్పించినట్లైతే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Leave a Reply