సిని వార్తలు

సమంత తండ్రితో మాట్లాడిన నాగార్జున.. చైతూ రెండో పెళ్లి కోసమేనా?

హైదరాబాద్ : విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇద్దరూ కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. పైగా ఇద్దరు తమ సినిమాలతో ఒకేసారి పోటీ పడుతున్నారు.

చైతు అమీర్‌ఖాన్‌తో నటించిన లాల్‌సింగ్ చద్దా ఆగస్టు 11న వస్తుంటే, సమంత నటించిన థ్రిల్లర్ మూవీ యశోద ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. విడాకుల తర్వాత చైతు పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేడు. కాంట్రవర్సీ పోస్టులు కూడా పెట్టలేదు. సమంత మాత్రం అనేకానేక అర్థాలు, సందేహాలకు తావిచ్చేలా పోస్టులు పెడుతూ వచ్చింది.

విడాకులైనా సమంతపై నాగార్జున ప్రేమ తగ్గలేదు. కోడలుగా ఆమెపై ఆప్యాయతగా వుంటున్నారు. విడాకుల తర్వాత కూడా నాగ్ సమంత మా ఇంటి ఆడబిడ్డే.. ఆమె అంటే గౌరవం ఉందని నాగార్జున చెప్పాడు.

తాజాగా నాగార్జున నేరుగా వెళ్లి తన మాజీ కోడలు సమంత నాన్నను కలిశాడన్న వార్తలు వస్తున్నాయి. గంటపాటు వీరిద్దరు చర్చించుకోగా.. సమంత – చైతు భవిష్యత్తు బాగుండేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అక్కడే సమంత కూడా ఉండడంతో నాగ్‌.. సమంతతోనూ మాట్లాడినట్టు చెపుతున్నారు.

నాగ్ మళ్లీ చైతుకు పెళ్లి చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ రెండో పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదనే సామ్‌ను, ఆమె తండ్రిని కలిసినట్టు తెలుస్తోంది.

Leave a Reply