అంతర్జాతీయ వార్తలు

ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాక్

అమెరికా : ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత వ్యయం తగ్గించుకోవాలనే పేరుతో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. సంస్థ నుండి ఇప్పటికే 3400 మంది ఉద్యోగులను తొలగించారు. తాజాగా మరో 50 మందిని తొలగించనున్నట్లు సమాచారం. వీరంతా ప్రొడక్ట్‌ విభాగంలో పనిచేస్తున్నారని, త్వరలోనే వీరిపై వేటు పడనుందని తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులను 2 వేల లోపు పరిమితం చేయాలని మస్క్ భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply