ఆంధ్రప్రదేశ్

ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

కడప : వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. పులివెందులలోని వైసీపీ కార్యకర్తలు, అవినాశ్ అనుచరులు తనను అనుసరిస్తున్నారని.. వారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భాస్కరరెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని తెలిపారు. అయితే ఆఫీసులో ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. తనకు ఏమైనా జరిగితే అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ దే బాధ్యతని వెల్లడించారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలుకెళ్లేందుకు సిద్ధమని.. లేదంటే తన పదవికి అవినాశ్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.

Leave a Reply