సిని వార్తలు

ఫిబ్రవరి 4న వస్తున్న ‘ఆచార్య’ – క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీనే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

నిజానికి జనవరి 7వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రేస్‌లో ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’, ‘సర్కారువారిపాట’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో ‘ఆచార్య’ చిత్రాన్ని మరోమారు వాయిదావేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.

వీటిపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. ‘ముందుగా ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం’ అని చిత్ర బృందం తెలిపింది.

కాగా, ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యుడుగాను, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, ఆచార్యకు అండదండలు అందించే పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలకమైన సిద్ధ పాత్రలో కనిపించనున్నారు.

Leave a Reply