ఆంధ్రప్రదేశ్

ఊరూవాడా జగనన్న జన్మదిన సంబరాలు

ఏపీ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఊరూవాడా సంబరాలు అంబరాన్ని అంటాయి. భారీ కేక్ లు, సాంస్క్రతిక కార్యక్రమాలు, దేవాలయాల్లో ఘనంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు, మెగా రక్తదాన శిబిరాలు, ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు, బహుమతుల ప్రదాన కార్యక్రమాలు, ఇలా ఒకటి కాదు క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ఏపీలో ముందే వచ్చాయా? అన్నంత ఘనంగా సీఎం జగన్ జన్మదిన సంబరాలు సాగిపోతున్నాయి.

ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తూ, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న పదికాలాలు చల్లగా ఉండాలి, ప్రజలందరికి ఇంకా ఎంతో మేలు చేయాలి, ప్రజాస్వామ్యంలో నూతనాధ్యాయాన్ని లిఖించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని వైసీపీ ఎమ్మెల్యేల ప్రసంగాలు సాగిపోతున్నాయి. మడమ తిప్పని జగనన్న, మా జగనన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెబుతాడు, లాంటి నినాదాలు మిన్నంటుతున్నాయి.

కార్యకర్తల ఆటలు, పాటలతో ఊరూవాడా అదిరిపోతున్నాయి. అందరూ ఫుల్ జోష్ గా ఉన్నారు. అప్పుడే ఏపీ ప్రభుత్వ అధికారులు అంతా కలిసి క్రిస్మస్ తేనేటి విందు ఏర్పాటు చేసి, సీఎంని ఆహ్వానించారు. జగన్ కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అధికారిక, అనధారిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

Leave a Reply