క్రీడా వార్తలు

టీమిండియా ఆటగాళ్ల జోరు.. ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన స్పిన్ ద్వయం

ఢిల్లీ : ICC Test Rankings | ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బౌలర్ల విభాగంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin)రెండో ర్యాంకులో నిలిచాడు. కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా(Jadeja),అశ్విన్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అక్షర్ పటేల్ ఐదవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు, ఏడవ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Leave a Reply