తెలంగాణ

మసాజ్ ముసుగులో వ్యభిచారం … పలువురు యువతుల అరెస్టు

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోమారు వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. మసాజ్ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగిస్తున్న వైనాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. దీనికి సంబంధించి ఓ విటుడితో పాటు మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు, పలువురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు స్థానిక బంజారా హిల్స్ రోడ్డు నంబరు 12లో కొందరు నిర్వాహకులు ఎలిగంట్ బ్యూటీ స్పాలూస్, అథర్వ హమామ్ స్పా పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో ఓ మసాజ్ కేంద్రాన్ని నెలకొల్పారు.
అయితే, ఈ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

అపుడు ఒక యువకుడుతో పాటు పలువురు అమ్మాయిలు, మసాజ్ సెంటర్ నిర్వాహకురాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply