అందాల విశాఖకు మెట్రో హంగులు.. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- త్వరలోనే విశాఖపట్నంకు మెట్రో రైలు(Metro Train) పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) స్పష్టంచేశారు.
⦿ విశాఖ వాసులకు గుడ్ న్యూస్
⦿ త్వరలోనే విశాఖకు మెట్రో రైలు
⦿ ప్రకటించిన మంత్రి నారాయణ
⦿ కేంద్రం ఆమోదం తెలపగానే పనులు షురూ
⦿ మెట్రో నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించేలా
⦿ వినతి పత్రం సమర్పించామన్న మంత్రి నారాయణ
⦿ 46.2 కి.మీలతో నిర్మానం మొదటి ఫేజ్ పనులు
త్వరలోనే విశాఖపట్నంకు మెట్రో రైలు(Metro Train) పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) స్పష్టంచేశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి నారాయణ ఈ విషయంపై మాట్లాడారు. కేంద్రం అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. అయితే మెట్రో నిర్మాణానికయ్యే నిధులు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరామని అన్నారు. మొత్తం మూడు కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ పనులను 46.2 కి.మీలతో నిర్మాణం చేపట్టనున్నామన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు(Local MLA’s) తగిన మార్పులు, చేర్పులు సూచించారు.
విశాఖ కారిడార్(Visakha Corridar) లో మొత్తం 14 జంక్షన్లు ఉన్నాయని అన్నారు. వీటిపై ముందుగా ఫ్లై ఓవర్లు వేయిస్తామన్నారు. ఫ్లై ఓవర్ల పైన మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఉండనుదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేల విజ్ణప్తి మేరకు డీపీఆర్(DPR) చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఒకటన్నారు. మెట్రో రాకతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖ వాసుల కల నెరవేరనుందని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా రవాణా రంగంలోనే విశాఖకు ఓ నూతన శకం ఆరంభం అవబోతోందని అన్నారు. మెట్రో రైలు రావడం వెనక చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కృషి మరిచిపోలేనిదన్నారు.