జాతీయ వార్తలు

నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ.. పాల్గొననున్న సీఎం కేసీఆర్

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇవాళ భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ జరుగనుంది. ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. నేడు మరో సభకు సిద్ధమైంది. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మరాఠా ప్రజల గుండెను హత్తుకుంటూ.. అన్ని వర్గాల నుంచి విశేష స్పందనను పొందుతుంది బీఆర్ఎస్ పార్టీ. శంభాజీనగర్‌ పట్టణంలో జబిందా ఎస్టేట్స్‌లో భారీ భహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. పట్టణమంతా గులాబీ రంగు జండాలతో నింపేశారు. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మందితో నిర్వహించే సభకుసీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, తెలంగాణ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేణుగోపాలచారి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply