ఆంధ్రప్రదేశ్

ఏ స్థాయి మద్దతు లేకపోతే హత్య చేస్తాడు…!!

విశాఖ : తన మాజీ డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై సార్క్ దేశాల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కంచరణ కిరణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి నుంచి గనుల వరకు అక్రమాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని కంచరణ కిరణ్ కుమార్ ఆరోపించారు.

ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్‌ని తీసుకెళ్లి హత్య చేసి, నేరుగా అతడి ఇంటికే శవాన్ని తీసుకొచ్చాడంటే.. అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తాడని సూటిగా ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణ ఆదేశించాలని కోరారు.

Leave a Reply