ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేషన్ కార్డులకు రంగం సిద్ధం-ఇలా తీసుకోండి..! ఏ జిల్లాలో ఎప్పుడంటే ?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అమరవతి :- ఏపీలో తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి జిల్లాల్లో విడతల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు విడతల్లో రేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో అక్రమాలకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జిల్లాల్లో ఎలా జరుగుతుందో కూడా వివరాలను ప్రకటించింది.

రాష్ట్రంలోని మొత్తం 1.45 కోట్ల రైస్ కార్డులను ఈ కొత్త కార్డులతో భర్తీ చేయబోతున్నారు. కొత్త కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, కార్డుదారుని గురించిన సమాచారం అంతే వచ్చేస్తుంది. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, లింగం, వయస్సు, యజమానితో సంబంధం, మరియు ఈకేవైసీ స్టేటస్ కూడా ఉంటుంది. అలాగే రేషన్ అర్హతలు అంటే సరుకులు , వాటి పరిమాణం కూడా వస్తుంది. చివరిగా రేషన్ తీసుకున్న స్టేటస్, రేషన్ పరిమాణం, షాప్ వివరాలు, సమయం కూడా వీటిలో తెలుస్తుంది.

ఈ కార్డుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా, ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు చేర్చాలని భావిస్తున్నారు. ప్రింటర్‌ల నుంచి కార్డులు మండల కార్యాలయాలకు, అక్కడి నుంచి మొబైల్ యాప్‌లో డిజిటల్ ఎక్ నాలెడ్జ్ మెంట్ ద్వారా రేషన్ షాపులకు పంపుతారు. ప్రతీ షాపుకు రేషన్ కార్డు పంపిణీకి ఓ ఉద్యోగిని కేటాయించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి ఈపోస్ మిషన్ లో అథెంటికేషన్ తీసుకుని కార్డులు ఇస్తారు.

మరోవైపు వృద్ధులు, వికలాంగులు, అవసరమైన వారికి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి కార్డులు ఇస్తారు. కార్డు తీసుకున్న తర్వాత సచివాలయ యాప్ లో వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు రియల్ టైం డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తారు. జిల్లాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొత్తం నాలుగు విడతల్లో జరగబోతోంది. జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్టు 25, 2025 నుంచి నెల్లూరు, విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో

ఆగస్టు 30, 2025 నుంచి గుంటూరు, ఏలూరు, అనంతపురము, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో

సెప్టెంబర్ 6, 2025 నుంచి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, వై.ఎస్.ఆర్. కడప, అన్నమయ్య జిల్లాల్లో

సెప్టెంబర్ 15, 2025 నుంచి శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుంది.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×