ఆంధ్రప్రదేశ్

క్యాలెండర్ ఆవిష్కరణ

ఇచ్చాపురం : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) క్యాలెండర్ను ఇచ్ఛాపురం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఇచ్చాపురం పట్టణంలోని న్యాయస్థానం ఆవరణలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటా ఐఏఎల్ క్యాలెండర్ను న్యాయవాదులందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గిన్ని సీతయ్యరెడ్డి, నాగరాజుపాత్రో, న్యాయవాదులు ఎస్ఎల్ నారాయణ, రమణయ్య రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డీకేఎం రెడ్డి, ఏబీ రెడ్డి, దేవరాజు, సామంతో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply