సిని వార్తలు

క్యాన్సర్ ని జయించిన తర్వాత హంసానందిని ఎలా మరిపాయిందో చుడండి

హైదరాబాద్ : హంసా నందిని..క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. ఈ విషయాన్ని తెలియాజేస్తూ హంసా నందిని ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఏడాది క్రితం జుట్టు లేకుండా.. ఏడాది తర్వాత జుట్టుతో ఎలా ఉన్నానో తెలియజేస్తూ వీడియో షేర్ చేసింది.

అయితే స్పెషల్ సాంగ్స్, సహాయ నటిగా అలరించిన ఈ హీరోయిన్.. గత రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గతేడాది డిసెంబర్‏లో ఆ మహమ్మారిని జయించింది. ఈ క్రమంలో ఇప్పుడు తిరిగి తన లపై దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిన హంసానందిని తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరలవుతుంది. ఏడాది క్రితం క్యాన్సర్ చికిత్సలో భాగంగా పూర్తిగా జుట్టు కోల్పోయి గుండుతో ఉన్న వీడియోతోపాటు..

ఆ మహమ్మారిని జయించి తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న ఆమె సముద్రపు ఒడ్డున అందంగా మారిన తర్వాత సంతోషంతో ఉన్న వీడియోను షేర్ చేసింది. ఒక సంవత్సరంలో చాలా జరిగాయి. ప్రస్తుతానికైతే బాగున్నాను అంటూ రాసుకొచ్చింది. జుట్టు ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా.. సహయనటిగా అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. అలాగే లౌక్యం, రుద్రమదేవి, జై లవకుశ సహా పలు చిత్రాల్లోనూ నటించింది.

Leave a Reply